ఇవాళ ఆకాశంలో ఖగోళ వింత
ఇవాళ ఓ అరుదైన వింత ఆకాశంలో ఆవిష్కృతం కానుంది. ఓ వైపు పాక్షిక చంద్రగ్రహణం, మరోవైపు ఫ్లూటో గ్రహం ఒకేసారి గగనతలంలో దర్శనమివ్వనున్నాయి. గ్రహణం మధ్యాహ్నం రెండున్నరకు ప్రారంభమై....రాత్రి 7 గంటల 49 నిమిషాలకు ముగుస్తుంది. తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికాలోని కొన్ని ప్రాంతాల వారు, హిందూ, పసిఫిక్ మహా సముద్ర ప్రాంతాల ప్రజలు మాత్రమే ఈ గ్రహణాన్ని పూర్తిగా దర్శించే వీలుంది. ఈశాన్య భారత ప్రజలు మాత్రమే గ్రహణం తర్వాత చంద్రోదయాన్ని చూడగలరు. సూర్యాస్తమయం తర్వాత ఆకాశంలో ప్రకాశవంతగా దర్శనమిచ్చే ఫ్లూటోను రాత్రంతా వీక్షించే అవకాశం ఉంది. అయితే ఫ్లూటోను టెలిస్కోపుతో మాత్రమే చూడవచ్చు.
వీడియో చూడండి...
0 comments:
Post a Comment